రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలను ఆదుకోవాలని కన్నా కోరారు. లాక్ డౌన్‌తో పనుల్లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంతంలో అనేక రకాల పనులు నిలిచిపోవడం, ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కొత్త ఇసుక విధానం పేరిట కొన్ని నెలల పాటు జాప్యం జరగడంతో కార్మికులు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.భవన నిర్మాణ పనులు చేసేవారు, ఇతర కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.196.75 కోట్లు కేటాయించిందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఈ నిధులను వినియోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ నిధులతో రాష్ట్రంలోని 19 లక్షల మంది కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్‌కు లేఖ రాశారు. వలస కార్మికులను ఆదుకోవాలని వినతులు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి వలస కార్మికుల కోసం సీఎం జగన్‌కు కన్నా లేఖ రాశారు.
ఏపీకి రూ. 197 కోట్లు ఇచ్చిన కేంద్రం,